durgadevi : దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిదంగా పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో కూడా భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారి పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు. కోరిన కోరికలు తీరడంతో వివిధ రూపాల్లో తమ మొక్కులు అమ్మవారికి చెల్లించుకుంటున్నారు.
బంగ్లాదేశ్ లోని సత్ ఖీరా పట్టణంలోని శ్యామ్ నగర్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జెషోరేశ్వరి కాళీ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. 2021 లో ఈ ఆలయాన్ని మన దేశ ప్రధాన మంత్రి మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అప్పుడు అమ్మవారికి కానుకగా మోదీ బంగారు కిరీటాన్ని అందజేశారు.
ఈ ఆలయంలో గురువారం మధ్యాహ్నం దొంగతనం జరిగినట్టుగా ఆలయ పూజారి గమనించారు. దింతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మవారి విగ్రహం చోరీకి గురికావడంతో బాంగ్లాదేశ్ భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.