Home » TBGKS : టీబీజీకేఎస్ లో పొగపెట్టిన పుట్ట మధు మాటలు

TBGKS : టీబీజీకేఎస్ లో పొగపెట్టిన పుట్ట మధు మాటలు

TBGKS : తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనుల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు అధినేత కేసీఆర్ పురుడు పోశారు. ఏ ముహూర్తాన కేసీఆర్ పురుడు పోసి పేరు పెట్టారో తెలియదు కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అవమానాలనే మూటగట్టుకొంది సంఘం. కార్మిక గుర్తింపు సంఘంగా రెండుసార్లు తెలిచింది. కానీ విజయానికి తగిన విదంగా పనిచేయలేదనే పేరు ప్రఖ్యాతలు మాత్రం భారీగానే సంపాదించుకొంది. ప్రతి గని తో పాటు, డిపార్ట్ మెంటులలో సైతం అవినీతి ఆరోపణలే మిగిలాయి. క్వాటర్ కావాలంటే పైసలు. అక్రమ బదిలీలు, అవసరం లేని బదిలీలు సృష్టించి కార్మికులను భయానికి గురిచేయడం. తద్వారా వసూళ్లకు పాల్పడటం. క్వార్టర్లను ఆక్రమించుకొని 50 వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు అడ్వాన్స్ తీసుకొని అద్దెకు ఇచ్చుకోవడం, కార్మికులను అధికారులు వేధించినా పట్టించుకోకపోవడం, మహిళా కార్మికులపై వేధింపులు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి టీబీజీకేఎస్ పరిపాలనలో. వీటికితోడు యూనియన్ లో అంతర్గత గొడవలు , పదవుల కోసం వెంపర్లాడటం తోనే కాలం గడుపుకున్నారు యూనియన్ నాయకులు. రాష్ట్రంలో మాతృ సంస్థ అధికారం కోల్పోగానే యూనియన్ లో చలిజ్వరం పుట్టింది. ఇకనుంచి పార్టీ తో యూనియాన్ కు సంబంధాలు ఉండవని నాయకులు తేల్చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ జెండా మోయడం విశేషం.

ఇటీవల పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు చేసిన వ్యాఖ్యలు యూనియన్ లో కలకలం సృష్టించాయి. పుట్ట మధు మాట్లాడిన మాటలు టీబీజీకేఎస్ ఇంటిలో పొగపెట్టినట్టు అయ్యింది. కొందరు యూనియన్ నాయకుల పనితీరుతోనే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారని అన్న మాటలు యూనియన్ కు తలనొప్పి తెచ్చిపెట్టాయి. వాళ్ళు చేసిన అక్రమాలు పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయని మధు అనడంతో నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. యూనియన్ నాయకుల అవినీతి, అక్రమాల వల్లనే కార్మికులు పార్టీకి దూరమయ్యారని ఆయన ఆరోపించారు. పార్టీకి యూనియన్కు ఎలాంటి సంబంధం కూడా ఉండదన్నారు. యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులమని చెప్పుకొని తిరుగుతున్న నాయకులకు పార్టీకి ఎలాంటి సంభందం లేదని మధు స్పష్టం చేశారు.

పుట్ట మధు సొంత నిర్ణయం తీసుకొని మాట్లాడలేదనే అభిప్రాయాలను సైతం అదే యూనియన్ కు చెందిన కొందరు నాయకులు వ్యక్తం చేయడం విశేషం. మధు మాట్లాడిన మాటలు అధినేత కేసీఆర్ నుంచి వచ్చినవే అని టీబీజీకేఎస్ కు చెందిన కొందరు నాయకులు అనడం కొసమెరుపు. మధు మాట్లాడిన మాటలతో ఇప్పుడు యూనియన్ త్రిశంకుస్వర్గంలో పడింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *