Home » mega star : మెగా అభిమానుల్లో అసంతృప్తి

mega star : మెగా అభిమానుల్లో అసంతృప్తి

mega star : తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక స్థాయిలో ఎదిగిన వ్యక్తులు ఎవరు కూడా కావాలని తప్పులు చేయరు. కావాలని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఆవేదనకు కూడా గురిచెయ్యరు. కానీ నమ్మిన స్నేహం కోసం అల్లు అర్జున్ చేసిన పని వలన మెగా అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కానీ బన్నీ చేసిన పని మంచిదే అనే అభిప్రాయాలు అల్లు అర్జున్ అభిమానులు వ్యక్తం చేయడం విశేషం. బన్నీ తీసుకున్న నిర్ణయంపై కొందరు అభిమానులు అనుకూలంగా మాట్లాడుతుండగా, మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. ఏదిఏమైనప్పటికీ బన్నీ చేసిన పని వలన మెగా కుటుంబంలో ప్రకంపనలు అయితే సృష్టించాయి.

తాజాగా అల్లు అర్జున్, తన భార్య తో కలిసి నంద్యాల పర్యటన చేపట్టారు. నంద్యాల నియాజకవర్గం నుంచి బన్నీ స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పడానికి బన్నీ రావడం జరిగింది. చిరకాల స్నేహితుడు కాబట్టి మర్యాదపూర్వకంగా వెళ్లి వచ్చారు బన్నీ, అతని భార్య. ఇది ఇప్పుడు పెద్ద వివాదాస్పదమైనది మేఘా అభిమానుల్లో.

అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయంతో మెగా స్టార్ చిరంజీవి కూడా అసంతృప్తి తో ఉన్నారని సమాచారం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. జనసేన కు వైసీపీ కి మధ్యలో పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటోంది. మెగా కుటుంబంలోని నటులంతా కూడా వ్యక్తిగతంగా వెళ్లి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేశారు. బన్నీ ఒక్కడు మాత్రమే సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులతోపాటు, మెగా అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది.

ఇది ఇలా ఉండగా బన్నీ అభిమానులు మాత్రం అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. స్నేహితుడు కాబట్టే ఇంటికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారు. అంతే కానీ ప్రత్యేకంగా ఇక్కడే కొద్ధి రోజులు ఇక్కడే ఉండి వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయలేదు కదా అని ప్రశ్నస్తున్నారు. నమ్మిన స్నేహం కోసం ఆ మాత్రం అభిమానం ఉంటుందని, ఆ అభిమానంతోనే అల్లు అర్జున్ వచ్చి శిల్ప రవి చంద్ర రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగిందని అల్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *