Singareni : మంచిర్యాల జిల్లా సింగరేణి జైపూర్ ప్లాంట్ లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించే విదంగా చొరవ తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో పాటు కమిషన్ సభ్యులను కలిసి సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ ఆన్తోటి నాగేశ్వరరావు, ధరావత్ పంతుల వినతి పత్రం అందజేశారు.
అదే విదంగా జైపూర్ ప్లాంట్ లో ఉద్యోగుల సౌకర్యార్థం లైబ్రరీ ఏర్పాటు చేయించాలని, భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల విద్యార్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలను విద్యుత్ ప్లాంట్ లో కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కమిషన్ చైర్మన్ ను కోరారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంకు జ్యోతిరావు పూలే పేరు పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో …. శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్, బ్రాంచ్ సెక్రెటరీ లు అందె వెంకటేష్, నక్క సుమన్, రెడపాక లక్ష్మి, అడ్వైజర్ గుణగంటి నర్సింగరావు ,జాయింట్ సెక్రెటరీ ఎర్రావుల శంకర్ ,చీఫ్ ఆర్గనైజ్ సెక్రెటరీ వెలుగుల ప్రవీణ్, ఏరియా కమ్యూనికేషన్ ఇంచార్జ్ సుందిళ్ల నరేష్, ik 1 ఫిట్ సెక్రెటరీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు