YS JAGAN : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పోలింగ్ సమయం నాలుగు రోజులే ఉంది. ప్రచారానికి మూడు రోజుల సమయం మిగిలి ఉంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిపక్షాలకు చిక్కకుండా ఇన్ని రోజులపాటు సీఎం విస్తృత ప్రచారం చేశారు. ఇంటిపోరు, ప్రతిపక్షాల పోరుకు చిక్కకుండా తనదయిన శైలిలో ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను గెలిపించుకోవడం, మరోవైపు రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి ప్రతిపక్ష పార్టీలతో పోరాటం చేసి అలసిపోయారు ఆ సీఎం. ఎలాగూ ఫలితాలు జూన్ నాలుగున రానున్నాయి. అంతవరకు రాష్ట్రంలో ఉండి పరిపాలించేది అంటూ ఏమిలేదు. నిర్ణయాలు తీసుకునే అధికారం అంతంత మాత్రమే. అత్యవసర నిర్ణయాలు మాత్రమే తీసుకునే అధికారం ఉంది. అటువంటప్పుడు రాష్ట్రంలో ఉండి పరిపాలన పరంగా నిర్ణయాలు తీసుకునే ఫెసులుబాటు ఏమీ లేదు. ప్రచారం చేసి అలసిపోయారు. కాబట్టి ఆ సీఎం విదేశీ బాట పట్టారు.
ఇంతకూ ప్రచారం చేసి అలసిపోయిన ఆ సీఎం ఎవరు అనుకుంటున్నారా ???, ఇంకెవరూ ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డ్. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మే 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ CBI కోర్టు ను బుధవారం కోరారు. కుటుంబంతో స్విట్జర్లాండ్, లండన్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తన న్యాయవాదులతో ఫిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదని ఉన్న బెయిల్ షరతు కు మినహాయింపు ఇవ్వాలని CBI కోర్ట్ ను జగన్ కోరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థనను పరిగణలోకి కోర్ట్ తీసుకోంది. జగన్ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని CBI ని కోర్ట్ ఆదేశించింది. జగన్ పిటిషన్ పై కోర్ట్ గురువారం విచారణ చేపట్టనుంది.