25 BRS mls’s : తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి పెట్టడానికి సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్ పద్ధతులు నచ్చకపోవడంతో పార్టీ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇందుకు సంబందించిన చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. 25 మంది ఎమ్మెల్యేలు ముహూర్తం కూడా చూసుకోవడం జరిగిందన్నారు. జూన్ 5న ఒకేసారి 25 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను, ఆయన పెట్టిన పార్టీ ని, గులాబీ కండువాలను వదిలిపెట్టడానికి సిద్ధమయ్యారని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. అదేరోజు 25 మంది ఎమ్మెల్యేలతోపాటు, వారి అనుచరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి సిద్ధమయ్యారు. కేసీఆర్ … ఈ జూన్ 5 తేదీ గుర్తు పెట్టుకో అంటూ సవాల్ విసిరారు.
Also Read: ఈ సమయం ప్రకారమే అక్షయ తృతీయ పూజ చేయాలి
అదేవిదంగా అదే ముహూర్తాన బిఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 17 మంది నాయకుల్లో ఆరుగురు అభ్యర్థులు కూడా గులాబీ కండువా వదిలేసి, కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డ్ చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. 36 మంది మిగిలారు. ఇందులోంచి 25 మంది కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పిందే నిజమై కాంగ్రెస్ గూటికి వెలితే ఇక గులాబీ గూటిలో మిగిలేది 11మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. ముహూర్తం వరకు మరికొందరు కూడా సిద్ధం అయితే ఎందరు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
Aslo Read: దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న డైరెక్టర్
———————–
Editor : PR Yadav
9603505050
———————–