KCR ,KTR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త చర్చకు తెరలేపారు. నిశ్శబ్దవాతావరణంలో ఉన్న కేసీఆర్ కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య జరుగుతున్న అంతర్గత విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా అబద్దం అని చెప్పడానికి వీలులేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంతో కొంత నిజం లేనిదే సీఎం అనవసరంగా నోరుపారేసుకోడనే మాటలు కూడా వినబడుతున్నాయి.
గతంలో కేసీఆర్, కేటీఆర్ మధ్య జరిగిన విషయాలపై, తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరిపోవడంతో బిఆర్ఎస్ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మధ్యలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీ కి రారని ప్రకటించారు. కానీ కేటీఆర్ మాట్లాడిన మరుసటి రోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. అంటే ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య సమాచార లోపం ఉందనడానికి ఇదొక తార్కాణం. ఇదే విషయాన్నీ సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ కేసీఆర్ – కేటీఆర్ ల మధ్య సయోధ్య లేదంటూ చెప్పడం జరిగింది.
వాస్తవానికి తండ్రి, కొడుకుల మధ్య అభిప్రాయాలు తలెత్తాయనే ప్రచారం కూడా జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పోటీచేద్దామని కేటీఆర్ చెప్పిన మాట కేసీఆర్ వినకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత కేటీఆర్ తండ్రి వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం కూడా జరిగింది.
సీఎం చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా ? లేదంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరుకున పెట్టడానికే ఈ విదంగా మాట్లాడారా ? అనే గుసగుసలు కూడా బిఆర్ఎస్ గూటిలో మొదలైనాయి. ఏదిఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పడు గులాబీ శ్రేణుల్లో చర్చకు అవకాశం ఇచ్చినట్టు కూడా అయ్యింది.