Fraud Marriage : అతి తక్కువ సమయంలో సంపాదించాలి. కష్టపడకుండా ఎదగాలి. లక్షాధికారి కావాలి. అయితే ఏమిచేయాలి. మోసం చేయాలి. మోసం చేయాలంటే ఎవరినో ఒకరినో మోసం చేస్తే అనుకున్నంత సంపాదించలేము. అందుకే పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నవారు అయితే సులభంగా మోసపోతారు. వారి నుంచి డబ్బు గుంజవచ్చు.
వాళ్ళను ఎలా తెలుసుకోవాలి. ఇంకేముంది మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా విడాకులైన మహిళలను ఎంపిక చేసుకున్నాడు. వారితో పరిచయం పెంచుకున్నాడు. 20 మంది విడాకులైన మహిళలను మోసం చేసి వారిని పెళ్లి చేసుకున్నాడు. అతన్ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫిరోజ్ నియాజ్ షేక్ (43) అనే వ్యక్తి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయాలు పెంచుకొన్నాడు. మాయ మాటలతో నమ్మించి వాళ్ళను పెళ్లికి ఒప్పించాడు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ,ఇలా దేశవ్యాప్తంగా 20 మందికి పైగా మహిళలను వివాహం చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న తరువాత మహిళల నుంచి డబ్బు, బంగారు నగలు తీసుకొని కనబడకుండా పారిపోయే వాడు. మోసపోయిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్‌బుక్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మ్యాట్రిమోనియల్లో విడాకులు తీసుకున్న వారిని, వితంతువులను లక్ష్యంగా చేసి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులను తీసుకున్నట్లు విచారణలో వెల్లడైనది. మరోవైపు ఫిరోజ్ కు కఠిన శిక్ష పడాలని బాధితులు ఆయా ప్రాంతాల్లో డిమాండ్ చేస్తున్నారు.