Mudhiraj : ముదిరాజుల రాజకీయ వాటా సాధించుకునే వరకు నిరంతరం శాంతియుత పోరాటాలు చేద్దామని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బట్టు విట్టల్ స్పష్టం చేశారు. జిల్లాలోని నాగిరెడ్డి మండలంలోని వాడి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ముదిరాజులు ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్బంగ విట్టల్ మాట్లాడుతూ ……. ముదిరాజ్ సంస్కృతి, సాంప్రదాయాలు ఆచారాలు,అమ్మపెద్దమ్మ తల్లి ఆశీస్సులతోనే సృష్టించబడినాయన్నారు. పూర్తి నమ్మకంతో విశ్వాసంతో,నమ్మిన ప్రతీ ఒక్కరిని అమ్మవారు కాపాడుతారన్నారు.
రాజకీయ హక్కుల కోసం మన ముదిరాజ్ కులం పోరాటాలు చేస్తుందన్నారు. అంతేగాని ఇతర కులాలతో పోటిగాని, కొట్లాటగాని మన కులానికి ఉండదన్నారు. మన కులం హక్కులు సాధించుకునేవరకు నిరంతరం శాంతియుతంగా పోరాటాలు ప్రభుత్వంతో చేయాల్సిందే నన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టే పోరాటాలకు ముదిరాజ్ కులబాంధవులు తరలిరావాలని విట్టల్ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ప్రతి ముదిరాజ్ కుటుంబం బాధ్యతాయుతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ హక్కులు సాధించుకున్నప్పుడే ముదిరాజ్ కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు సైతం ఉంటాయని విట్టల్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో ముదిరాజ్ సంఘం మండల,అధ్యక్షులు బాలయ్య ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి నారాయణ ముదిరాజ్, జిల్లా నాయకులు సిద్దయ్య ముదిరాజ్, వెంకన్నముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరివి బిబిపేట మండల్ నర్సింలు ముదిరాజ్, వివిధ గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.