Home » కేసీఆర్ కుటుంబంలో ఎం జరుగుతోంది…..

కేసీఆర్ కుటుంబంలో ఎం జరుగుతోంది…..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమాన్ని లేవనెత్తారు.ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా కేసీఆర్ కావడం విశేషం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబములో కొందరు ముందుగా ప్రవేశించారు. మరి కొందరు వెనుక పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఒకరి తరువాత ఒకరు ఉద్యమంలో అడుగుపెట్టారు. కేసీఆర్ వెంటే కుటుంబం నడిచింది. మొదట మేనల్లుడు హరీష్ రావ్ కేసీఆర్ వెంట ఉద్యమంలో నడిచారు. ఆ తరువాత కొడుకు కేటీఆర్ ప్రవేశించడం జరిగింది. ఈ ఇద్దరి తరువాత కూతురు కవిత కూడా ఉద్యమబాట పట్టారు.

2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పురుడు పోసుకుంది. 2004 లో జరిగిన ఎన్నికల్లో అధినేత కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ స్తానం తోపాటు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సైతం పోటీచేశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో కేసీఆర్ విజయం సాధించారు. రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో అవసరాలు ఉంటాయనే ఉద్దేశ్యంతో కేసీఆర్ లోకసభ కె పరిమితం అయ్యారు. సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తో పొత్తు ఉన్న నేపథ్యంలో కేంద్రంలో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పదవీ భాద్యతలు కూడా చేపట్టారు. ఉద్యమ రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో కేసీఆర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజనమే చేశారు .

ఆ తరువాత 2006, 2008 లో జరిగిన ఎన్నికల్లో కూడా కేసీఆర్ రెండు సార్లు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు.2014 లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. సిద్దిపేట నుంచి ఆయన రాజకీయంగా పురుడు పోసుకున్నారు. అయినా సిద్దిపేటను కాదని గజ్వెల్ నుంచి ఎమ్మెల్యేగా కొత్త రాష్ట్రంలో పోటీచేసి గెలుపొందారు.గులాబీ నేతగా మెజార్టీ సాధించి తెలంగాణ రాత్రానికి తోలి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. పదేళ్ల తరువాత బిఆర్ఎస్ నేతగా ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నారు.

2014 ఎన్నికల్లో హరీష్ రావ్ సిద్ధిపేట నుంచి పోటీచేసి గెలుపొందారు.అదే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీచేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఈ ఇద్దరు కూడా మంత్రివర్గంలో చోటు సంపా దించు కున్నారు. 2014 ఎన్నికల్లో నిజామాబాదు నుంచి కవిత ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.2019 ఎన్నికల్లో కవిత అదే స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కవిత ఎమ్మెల్సి గ కొనసాగుతున్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి చెందిన కేటీఆర్,హరీష్ రావ్ పోటీచేసి గెలుపొందారు.

తాజాగా ప్రకటించిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రము నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా పోటీచేయకపోవడం విశేషం. కేసీఆర్ ఖచ్చితంగా పార్లమెంట్ కు వెళుతారని పుకార్లు వెల్లువెత్తాయి. మెదక్ లేదా మల్కాజిగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తారని పార్టీ శ్రేణులు భావించారు. కానీ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.ఉద్యమం మొదలు పెట్టిన నాటినుంచి నేటివరకు జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పోటీలో పాల్గొన్నారు.కానీ తాజాగా జరగబోయే ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పోటీకి దూరంగా ఎందుకు ఉన్నారో అనే విషయాన్ని కూడా కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులే బయట పెట్టాలనే అభిప్రాయాలు సైతం రాష్ట్రంలో వ్యక్తం అవుతున్నాయి.

—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *