Telangaana Districts : తెలంగాణ రాష్ట్రములో రెండోసారి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడే నాటికి రాష్ట్రంలో పది జిల్లాలు ఉండేవి. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీర్ పది జిల్లాలను విస్తరించారు. పది జిల్లాల స్థానంలో ముప్ఫయ్ మూడు జిల్లాలను ఏర్పాటు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. పాత పది జిల్లాలతోపాటు కొత్తగా ఏర్పడిన 23 జిల్లాలు ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారనేది కూడా ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కేవలం ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండటానికే అదనంగా 23 జిల్లాలను ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వ సమాచారం.
తెలంగాణాలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త జిల్లాల పై స్పందించింది. కానీ అక్కడ ఒక కొలతబద్ధగా కొత్త జిల్లాలను ఆ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. ఏపీ లో పాతవి,కొత్తవి కలుపుకొని పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. పార్లమెంట్ కు ఒక నియోజకవర్గం వచ్చే విదంగా జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజల నుంచి ఎక్కడ కూడా వ్యతరేకత రాలేదు. పార్లమెంట్ కు ఒక జిల్లా చొప్పున కేటాయించేసరికి ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం మాత్రం తనకు నచ్చిన రీతిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం.
తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులకు, ఫింఛనుదారులకు సకాలంలో వేతనాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో 33 జిల్లాలతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఖర్చు తడిసి మోపెడవుతోంది. కొత్త జిల్లాలను తగ్గించుకోవాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్టంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా జగన్ బాటలో నడిచి తెలంగాణాలో కూడా పార్లమెంట్ కు ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఏపీ పద్దతి అమలు అయితే తెలంగాణాలో 33 జిల్లాలు ఉండవు. పాతవి 10 జిల్లాలు ఉండవు. 17 జిల్లాలు మాత్రమే ఉంటాయి.