Pavan Kalyan : 2024 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం ఖరారు. పార్టీలన్నీ అధికారం కోసం రంగంలోకి దిగాయి. మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. కాంగ్రెస్, కూటమి, వైసీపీ పార్టీలు అధికారం కోసం కుస్తీ పడ్డాయి. సీఎం జగన్ రెండోసారి అధికారం చేపట్టాలని ఒంటరి పోరాటం చేశారు. రోజుకో ఉమ్మడి జిల్లా చుట్టి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఒంటరి పోరాటమే చేసింది. కానీ జగన్ ను ఓడించడానికి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. జూన్ 4 న ఓట్ల లెక్కింపు. ఎట్టకేలకు కూటమి దాటి తట్టుకోలేక వైసీపీ పార్టీ అభ్యర్థులు చతికిల పడిపోయారు. అధికారంకు వైసీపీ దూరమైనది.
కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఒకవైపు సినిమా రంగం, మరోవైపు రాజకీయం. రెండింటిని సమానంగానే చూశారు. కానీ ఆయన లక్ష్యం మాత్రం జగన్ ను రాజకీయంగా అసెంబ్లీకు దూరం పెట్టడమే. అందుకే 2014 లో పార్టీని స్థాపించారు. కానీ పోటీ చేయలేదు. 2019 లో మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను బరిలో దింపారు. ఆయన కూడా రెండు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లో గెలుస్తాను అనే ధీమాలో ఉన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ ధాటిని ఆ ఎన్నికల్లో తట్టుకోలేక పోయాడు. రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు అసెంబ్లీ స్థానాల్లో పరాజయం పాలయ్యారు.
2019 ఎన్నికల్లో అధినేత పవన్ కళ్యాణ్ ఓటమితో పార్టీ నాయకులు, కార్య కర్తలు కుంగిపోయారు. పార్టీ కోలుకోవడం కష్టమని భావించారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పవన్ కళ్యాణ్ జగన్ ను ఇంటి బాట పట్టించడానికే కంకణం కట్టుకున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. పక్క ప్రణాళికతో కూటమి ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికల్లో అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేశారు. అధికార పార్టీ అభ్యర్థి వంగ గీత పై సుమారు దెబ్బయ్ వేల, మూడు వందల యాభయ్ నాలుగు మెజార్టీ సాధించారు. అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కూటమి అభ్యర్థిగా మంత్రి మండలిలో కూడా దాదాపుగా బెర్త్ ఖాయమనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.