srishylam : ప్రముఖ అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీ శైలం ఒకటి కావడం విశేషం. మల్లికార్జున క్షేత్రంలో కొలువైన అమ్మవారు భ్రమరాంబికా దేవి . శుక్రవారం ఆలయ క్షేత్రంలో అమ్మవారికి కుంభోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు.ఈ ఉత్సవంలో ఆలయ కమిటీ, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కుంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారం, మంగళ వారం రోజుల్లో భ్రమరాంబిక దేవి అమ్మవారికి కుంభోత్సవాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించి తమ భక్తిని చాటుకోవడం విశేషం.
ఆలయాన్ని నిమ్మకాయలతో సుందరంగా అలంకరించారు. సూర్యోదయానికి ముందునుంచే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. వేద మంత్రాలతో విశేష పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీచేశారు. సాంప్రదాయం ప్రకారం సాత్విక బలి గా అమ్మవారికి గుమ్మడి కాయలు, కొబ్బరికాయలను నిమ్మకాయలను సమర్పించారు. అమ్మవారికి ఇష్టమైన వివిధ రకాల వంటలు చేసి నైవేద్యముగా సమర్పించారు. ఆలయ ఉద్యోగి ఒకరు మహిళ వేషధారణలో ప్రత్యేకంగా వచ్చి అమ్మవారికి హారతి ఇచ్చి మొక్కులు చెల్లించారు. ఆ సమయంలో ఆలయ ద్వారాలను మూసివేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. హారతి కార్యక్రమం అనంతరం భక్తులకు భ్రమరాంబిక దేవి నిజరూప దర్శనమునకు ప్రవేశం కల్పించారు. కుంభోత్సవం కార్యక్రమం నిర్వహించిన సమయంలో ఆర్జిత సేవలు, కల్యాణోత్సవం, ఏకాంత సేవలను తాత్కాలికంగా ఆలయ కమిటీ నిలిపివేసింది.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-