cm jagan toor : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎట్టకేలకు కోర్ట్ అనుమతితో ఈనెల 17న విదేశాలకు ప్రయాణమై వెళ్లారు. సుమారు మూడు నెలల పాటు పార్టీ ఎన్నికల పనిలో అలసిపోయారు. కొద్దీ రోజుల పాటు విదేశాలకు కుటుంబంతో వెళ్ళడానికి నిర్ణయించు కున్నారు. దేశం దాటి వెల్లరాదనే కోర్ట్ నిబంధన ఉండటంతో ఆయన సీబీఐ కోర్టులో అనుమతి కోసం పిటిషన్ వేశారు. కోర్ట్ అనుమతితో జగన్ భార్య, పిల్లలతో కలిసి 17న విదేశాలకు వెళ్లారు. ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాలు జూన్ నాలుగున రానున్నాయి. తన పర్యటన ముగించుకొని జూన్ ఒకటిన ఏపీ కి రానున్నారు. జగన్ కుటుంబంతో కలిసి వెళుతున్నారు కాబట్టి ఖర్చు జగన్ భరించాల్సిందే. అదే అధికారిక పర్యటన అయితే మాత్రం ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
జగన్ కు రక్షణ గా వెళ్లాల్సిన పోలీస్ సిబ్బంది ముందుగానే వెళ్ళింది. సీఎం జగన్ కంటే ముందుగానే సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం జగన్ రక్షణ కోసం వెళ్లిన నలుగురు అధికారుల ఖర్చు దాదాపుగా కోటిన్నర కు పైగానే అవుతాయని అధికార వర్గాల సమాచారం. అధికారులకు వెళ్లి రావడానికి విమానం టికెట్, వసతి, భోజనం, ఇతరత్రా ఖర్చులు కలిపితే కోటిన్నర దాటే అవకాశాలు సైతం ఉన్నాయని సమాచారం.
ఈనెల 17న సీఎం జగన్ కుటుంబంతో కలిసి విశ్రాంతి కోసం వెళ్లారు. విదేశీ పర్యటన ముగించుకొని జూన్ ఒకటిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. జగన్ ఏ విమానంలో వెళ్ళాడు. దాని అద్దె ఎంత. విమానం పేరు ఏమిటనేది పెద్ద చర్చగా మారింది ఏపీ లో .
జగన్ విదేశాలకు వెళ్ళడానికి తీసుకెళ్లిన విమానం విస్టా జెట్ కంపెనీ కి చెందినది. దాని పేరు బొంబార్డియర్ 7500 . ఈ విమానం చాల విలాసవంతమైనది. అత్యంత ధనవంతులు మాత్రమే వాడుతారనే పేరు ఉంది. సకల సౌకర్యాలు ఉంటాయి అందులో. ఒక గంటకు ఆ విమానంను అద్దెకు తీసుకుంటే 12 లక్షల రూపాయలు చెల్లించాలి జెట్ కంపెనీ సంస్థకు. సీఎం జగన్ గంటకు పన్నెండు లక్షలు వెచ్చించి ఆ సకల సౌకర్యాలు ఉన్న విమానాన్ని తీసుకెళ్లడంతో ఏపీ లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
ఎందుకంటే తనకు మొబైల్ ఫోన్ కూడా లేదని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ తెలిపారు. ఫోన్ లేని నాయకుడు అంత ఖరీదయిన విమానంలో ప్రయాణించడం విశేషం.