BJP : తెలంగాణ బీజేపీ లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. హైదరాబాద్ కేంద్రంగా కలకలం వ్యక్తం కావడంతో ద్వితీయ శ్రేణులు కూడా పార్టీ లో ఎం జరుగుతున్నదని చర్చించుకుంటున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన మాటలకు పదును పెట్టారు. పార్టీ పెద్దలపై విరుచుకు పడ్డారు. దింతో పార్టీలో కలకలం మొదలైనది. బీజేపీ హైదరాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతమ్ రావును ప్రకటించడంతో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఒక్క మీ నియోజకవర్గం పరిధిలోని నాయకులకే పదవులు ఇవ్వండి. మిగతా ప్రాంతాల్లో అర్హులైన నాయకులు మీకు కనబడుటలేదా అని రాజాసింగ్ ప్రశ్నించారు. మీకు సలాం కొట్టే నాయకులనే ఎంపిక చేసుకొని పదవులు ఇస్తున్నారంటూ ఆరోపించారు. మీకు గులాంగిరి చేయని చేయని వారికి పదవులు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారని రాజాసింగ్ సోషల్ మీడియా లో ఘాటుగా విమర్శించారు.
రాజాసింగ్ మాటలు బీజేపీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య గత కొంతకాలం నుంచి విభేదాలు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ సోషల్ మీడియా లో మాట్లాడిన మాటలకు ప్రాధాన్యత సంతరించు కోవడం విశేషం.