Ex CM : కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ నాకు మాత్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి భద్రత కావాలని కోరుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినన్ని రోజులు 900 మంది తో రక్షణ ఉండేది. అంతే కాదు అయన విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక భద్రత విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పడు అదేవిదంగా కావాలని కోరగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. గతంలో ఆయన ఎక్కడికి వెళ్లితే అక్కడ తనదయిన శైలిలో భద్రత ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా 900 మందితో రక్షణ ఏర్పాటు ఉండేది. ఇప్పుడు అదే తరహాలో రక్షణ కావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోర్టుకు వెళ్లినట్టు రాజకీయ వర్గాల సమాచారం.
ఎవరూ చూపించని ఆర్భాటం ఐదేళ్ల పరిపాలనలో వైఎస్ జగన్ చూపించారు. ఎక్కడికి వెళ్లినా గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిపివేయడం, ఆయన ప్రయాణించే దారిలో చెట్లు అడ్డుగా ఉంటె కొట్టించడం, ఎవరికీ కనబడకుండా అడ్డుగా గుడ్డలు కట్టడం జరిగేది. వైఎస్ జగన్ ఉన్న స్థానానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఎవరైనా ఉండాలి. అనుమతి ఉంటేనే ఆయన వద్దకు వెళ్ళాలి. లేదంటే నిరీక్షణే.
నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి కు ఉండాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూటమి ప్రభుత్వం కల్పించింది. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ఇప్పటి ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రత కల్పించింది. అయినప్పటికీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి భద్రత కావాలని కోర్ట్ లో పిటిషన్ వేయడం పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది.