Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. సంబంధిత ప్రభుత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. భారీ ఎత్తున నియామకాలను చేపట్టింది. ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒకేసారి శిశు సంక్షేమ శాఖలో 14, 236 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. 6,399 టీచర్, 7, 837 హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి మంత్రి సీతక్క ఇటీవలనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోస్టులను తొందరగా భర్తీ చేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు.
ఖాళీలు అధికంగా మారుమూల, గిరిజన ప్రాంతాల్లోనే ఖాళీగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో అర్హులైన గిరిజన అభ్యర్ధులతోనే భర్తీ చేయాలనీ కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కొద్దీ రోజుల్లోనే నియామక నోటిఫికేషన్ ప్రకటించి అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హత తోనే నియామకం ఉంటుంది. కాబట్టి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. నియామకానికి రాత పరీక్ష నిర్వహించి పదోతరగతి మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం.