copper : పురుషులు, మహిళలు చేతికి ఎదో ఒక కంకణం ధరిస్తారు. వెండి, బంగారం, రాగి, ఇత్తడి, నల్లదారంను కంకణం రూపంలో ధరిస్తారు. వీటిలో ఎదో ఒక రూపంలో మేలు జరుగుతుంది. కానీ రాగి కంకణం ధరిస్తే ఏం జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. రాగి కంకణం చేతికి ధరిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని వేద పండితులు ఈవిధంగా చెబుతున్నారు…..
రాగి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రాగి సూర్యుడితో అనుబంధం కలిగి ఉంటుంది. ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుంది. రాగి కంకణం శుభాన్ని తెస్తుంది. సానుకూల ప్రభావాన్ని అభివృద్ధి చేస్తుంది.
మానసిక స్పష్టత, ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. రాగి రక్షిత లోహంగా వేదంలో చెప్పబడింది. ఒత్తిడి, చికాకు, ఆందోళన దూరమవుతాయి. దుష్ట శక్తులు దరిచేరవు. సానుకూల ప్రభావాన్ని కలుగజేస్తుంది. శారీరక, ఆధ్యాత్మిక శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది.