Police : సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా పోలీస్ శాఖపై తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జరిగిన ఘటనపై ఇప్పటికే విచారణ మొదలైనది. కాబట్టి తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేయడం సరికాదన్నారు.
ఎవరిదగ్గర అయినా ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటె ఇవ్వాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కోరింది. కావాలని ఎవరైనా తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది .
కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం పోస్టు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సిటీ పోలీస్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆధారాలు, అదనపు సమాచారం ఉంటె పోలీస్ శాఖ కు ఇచ్చి సహకరించాల్సిందిగా సిటీ పోలీస్ శాఖ కోరింది.