కోల్ బెల్ట్ ప్రతినిధి
ఇది ఏమి పాట, ఏమి డాన్స్,ఆ మ్యూజిక్ ఏందీ, ఇదంతా కలిపి సినిమా హాల్లో వస్తుంటే అభిమానులు ఈల వేయకుంటే ఉంటారా. గంతులు వేయకుంటే అగగలరా. గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మరత పెట్టి పాటకు హీరో మహేష్ బాబు,హీరోయిన్ శ్రీలీల చేసిన డాన్స్ ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. సంక్రాతి కానుకగా అభిమాలకు అందివచ్చిన సినిమా మెప్పించింది.ముందుగా సినిమా పై మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆ ఆరువాత కుటుంబ పరంగా ఆకట్టుకొంది. సున్నితంగా మాట్లాడిన మహేష్ బాబు డైలాగులు అదరగోట్టాయి. ఈ సినిమాలో కుర్చీని మరత పెట్టి పాట ఎలా హిట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు.
విదేశాల్లోసాంగ్ వైరల్ …..
ఆ కుర్చీని మరత పెట్టి సాంగ్ విదేశాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ప్రారంభోత్సవాలకు ఇదే పాటను విదేశాల్లో వినిపిస్తున్నారు.విదేశాల్లో ఏ గల్లీకి వెళ్లిన ఇదే పాట మారుమోగుతోంది.ఇంటర్నేషనల్ లో కూడా శ్రీలీల,మహేష్ బాబు కుర్చీని మడతపెట్టేసారు.ఎవరి మొబైల్లో చూసినా ఇదే పాట మోగుతోంది.
ప్రారంభోత్సవాలకు కుర్చీ కావాలంట ….
ఇటీవల అమెరికాలో బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహించారు. ఆ పోటీల ప్రారంభోత్సవానికి ముందుగా ఆ కుర్చీని మరత పెట్టి సాంగ్ పెట్టారు. అదేవిదంగా అంతర్జాతీయ మోటార్ కంపెనీ ఒకటి కొత్త కారును విడుదల చేసింది. కార్ ను లాంచ్ చేయడానికి ముందు ఇదే పాటను పెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం.కుర్చీని మడత పెట్టు కుంటూ ఇంకా మహేష్ బాబు, శ్రీలీల ఎన్ని దేశాల్లో తిరుగుతారో వేచి చూడాల్సిందే