Tollywood Hero : చిత్ర పరిశ్రమలో హీరోలు వరుసగా రెండు లేదా మూడు హిట్లు కొడితే చాలు. వాళ్ళ రెమ్యునరేషన్ను ఆకాశానికి ఎత్తుకెళుతారు. కోట్ల రూపాయలకు వెళుతుంది. దిగివచ్చే పరిస్థితి రాదు. నిర్మాతలు కూడా వాళ్ళు చెప్పిన పారితోషకానికి తల ఊపాల్సిందే. టాప్ హీరోలతో సినిమా తీస్తేనే పెట్టిన పెట్టుబడి పోను అదనంగా లాభాలు వస్తాయి. అందనంత ఎత్తుకు వెళ్లిన హీరోల గ్రాఫ్ పడిపోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. గ్రాఫ్ పడిపోతే వాళ్ళ రెమ్యునరేషన్ కూడా పడిపోతుంది.
కొందరు హీరోలు మాత్రం అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని తమ పారితోషకాన్ని ఇంత అని చెబుతారు. అటువంటి హీరోల్లో టాలీఫుడ్ హీరో అక్షయ్ కుమార్ ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు అక్షయ్ కుమార్. ఆయన ఏ సినిమాలో నటించినా ఆ సినిమా హిట్ అయ్యేది.
నటుడు అక్షయ్ కుమార్ హిట్ సినిమా సాధించి మూడేళ్లు అయ్యింది. ఇప్పటివరకు ఆయన హిట్టు కు నోచుకోలేదు. బచ్చన్ పాండే సినిమాతో అయన గ్రాఫ్ పడిపోయింది. అప్పటి నుంచి వరుసగా ఆయన గ్రాఫ్ దిగుతోంది. ” ఓ మై గాడ్ ” సినిమాతో అక్షయ్ కుమార్ ఆశించినంత ఫలితం రాలేదు. డిస్ట్రిబ్యూటర్‌లను కూడా ఆ సినిమా ఆర్థికంగా నిలబట్టలేకపోయింది.
అక్షయ్ కుమార్ తన చివరి సినిమా ” బడే మియాన్ చోటే మియాన్ ” సినిమాలో నటించి వంద కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ తీసుకున్నట్టు హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్. ఇటీవల విడుదల అయిన ‘సర్ఫిరా ‘ సినిమాలో నటించినందుకు ముప్ఫయ్ కోట్లు మాత్రమే తీసుకున్నట్టు టాలీవుడ్ టాక్. ఒకప్పుడు వరుస విజయాలతో తిరుగులేని నటుడిగా చెలాయించిన అక్షయ్ కుమార్ ఇప్పడు అవకాశాల కోసం కూడా ఎదురుచూస్తున్నట్టు హిందీ పరిశ్రమలో చర్చ జరుగడం విశేషం.