Actor : ఆమె తల్లి దండ్రులు ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ లు. వాల్ కూతురు కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేసింది. ఒకవైపు చదువు, మరోవైపు సినిమాలో నటించాలనే కోరిక. ఇంకోవైపు మిస్ ఇండియా పోటీలకు సన్నద్ధమవుతోంది. అయినప్పటికీ చదువుపై శ్రద్ద ఉండటంతో మిస్ ఇండియా పోటీలకు హాజరు కాలేకపోయింది ఆ నటీనటుల కూతురు. ఇంతకూ ఆమె ఎవరు. ఆమె తల్లి దండ్రులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసు కుందాం.
హీరో రాజశేఖర్, హీరోయిన్ జీవిత చిత్ర పరిశ్రమలో నటీనటులు. వారిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నది అభిమానులకు తెలిసిన విషయమే. ఆ దంపతుల కూతరు శివాని రాజశేఖర్. శివాని ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే మిస్ ఇండియా పోటీలకు ఆహ్వానం అందింది. అదే సమయంలో ఎంబీబీఎస్ పరీక్షలకు హాజరు కావాలి.
ఎంతో కస్టపడి ఒకవైపు ఎంబీబీఎస్, మరోవైపు మిస్ ఇండియా పోటీలకు సన్నద్ధమైన ఆమె ఆవేదనకు గురైనది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మిస్ ఇండియా పోటీలకు వెళ్ళలేదు. డాక్టర్ కావాలనే కోరికతో ఎంబీబీఎస్ పరీక్షలకే హాజరైనది. ఎంబీబీఎస్ పూర్తయిన తరువాతనే సినిమాలో ప్రవేశించింది.