Padmashali : పద్మశాలి కులభాందవుల ఐక్యతనే భవిష్యత్తుకు పునాది అవుతుందని కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్ నేత అభిప్రాయపడ్డారు. బీబీపేట్ శ్రీ భక్త మార్కండేయ మందిర ప్రాంగణంలో కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం 2025, నూతన సంవత్సర క్యాలెండర్ ను అయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన సంఘం నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పద్మశాలి కుల బాంధవుడు సంఘాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం తప్పనిసరన్నారు. సంఘం బలోపేతం అయితేనే ఆర్థికంగా ఎదుగుతామన్నారు.
ఈ సమావేశములో జిల్లా సహాయ కార్యదర్శి చందుపట్ల విఠల్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ రాజేందర్ పట్టణ మహిళా అధ్యక్షురాలు చందుపట్ల, జమున అంకాలం ఉషశ్రీ, చింతకింది సిద్దీరాములు, చందుపట్ల పురుషోత్తం, దుడుగు రమేశ్, తుమ్మ మహేందర్, బత్తిని జనార్ధన్,తుమ్మ రవీందర్, మామిడాల రమేశ్, బింగి పెంటప్ప, అవధూత విఠల్, మల్కాపూర్ నుంచి చిలుక భాస్కర్ తుమ్మ రవి, తుమ్మ శంకర్ జనగామ నుంచి బాలే సహదేవ్,మాంధాపూర్ నుంచి అల్వాల నర్సింలుతోపాటు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.