Home » Minister : జాతరలో తెలంగాణ మంత్రి మోకాళ్లపై నిరసన

Minister : జాతరలో తెలంగాణ మంత్రి మోకాళ్లపై నిరసన

Minister : సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక క్యాబినెట్ హోదా మంత్రి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులు ఎంత నచ్చచెప్పినా ఆ మంత్రి అదే పద్దతిలో నిరసన కొనసాగించడం విశేషం. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఉమ్మడి కరీం నగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామి జాతర ప్రతి ఏటా జరుగుతుంది. ఈ జాతరకు సంబందించిన ఏర్పాట్లపై ముందస్తుగానే మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.

ఏర్పాట్లు భక్తులకు తగిన విదంగా లేకపోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయము లోపించడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్ళింది. గర్భగుడిలోకి వెళ్లకుండానే మంత్రి దర్శనము చేసుకొన్నారు. అక్కడే మోకాళ్లపై కూర్చొని తన నిరసన వ్యక్తం చేశారు. దింతో సంబంధిత అధికారులు రక్షణ పరంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *