Singareni : శ్రీరాంపూర్ ఏరియాలో జివిఆర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయుకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగ శ్రీరామ్ పూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. అనంతరం సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, దొడ్డిపట్ల రవీందర్, ఓబీ వర్కర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు కొండపర్తి శంకర్, సిఐటియు నాయకులు రాజేష్, బిజెపి నాయకులు అగు మల్లేష్, మాట్లాడుతూ…..
జివిఆర్ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చట్టం ప్రకారం అర్హులందరికీ బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించి అంద జేయాలన్నారు. అకారణంగా విధుల నుంచి తొలగించిన కాంట్రాక్టు కార్మికు లందరిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సింగరేణిలో ఇతర ఓబీలలో ఇచ్చే మాదిరిగా అలవెన్స్లు, జీతాలు, ప్రోత్సహకాలను సైతం ఇవ్వాలన్నారు.
భూ నిర్వాసితుల చట్టం ప్రకారం స్థానికులకు 80%, ఇతరులకు 20% ఉద్యోగాలను కేటాయించి వర్కర్లుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసారు. జాతీయ పండుగలకు కూడా వేతనంతో కూడిన మస్టర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అన్నం ప్రశాంత్, మల్లేష్, మాసు ప్రసాద్, లక్కం రవి, ముప్పు వంశీ, సిరిపురం పవన్ కళ్యాణ్, శ్రావణ్ , విజయ్ , సదానందం, కావటం కృష్ణ, ఆకుల సతీష్, గజ్జల సాగర్ తదితరులు పాల్గొన్నారు.