cricketer: యు ట్యూబ్ ఛానల్ కొందరికి అక్షయ పాత్ర అయ్యింది. ఛానల్ ప్రారంభించి కష్టపడి వారికి నికర ఆదాయం వస్తుంది. కొందరు ఉద్యోగాలు వదిలి ఛానల్ ప్రారంభించిన వారు సైతం ఉన్నారు. యు ట్యూబ్ ల ఓ అడుగుపెట్టిన వారిలో సినీనటులు, క్రికెటర్లు, ఆర్థిక వేత్తలు, ఉపాధ్యాయులు, వైద్యులు మేధావులు ఇలా ఎందరో ఉన్నారు. ఒక్క యు ట్యూబ్ తోనే కాకుండా ఇన్స్టా గ్రామ్, పేస్ బుక్ ఫ్లాట్ ఫారం లో కూడా తమ ప్రతిభ చూపిస్తూ తమ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. యు ట్యూబ్ ప్రారంభించిన వారిలో ఎక్కువ శాతం కంటెంట్ క్రియేటర్లుగా రాణిస్తున్నారు. దేశంలోని ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల్లో కొందరు యు ట్యూబ్ ఛానల్ మొదలు పెట్టారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ ముంబయ్ ఇండియన్స్ పేసర్, టీం ఇండియా ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా సైతం యు ట్యూబ్ లో అడుగుపెట్టడం విశేషం.
తాను ప్రారంభించిన ఛానల్ గురించి బుమ్రా తన ట్విటర్ ద్వారా అభిమానులకు షేర్ చేశారు. హలో… నేను మీ అభిమాన క్రికెట్ ప్లేయర్ ను బుమ్రాను. నేను నా సొంతముగా యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా చూడని విదంగా నేను కంటెంట్ మీ కోసం అందించబోతున్నాను. మీతో అన్ని విషయాలను పంచుకోవాలను కుంటున్నాను అంటూ అభిమానులకు ప్రత్యేకంగా మెసేజ్ పంపారు క్రికెటర్ బుమ్రా. ఇది చూసిన ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
ఇప్పటికే రాజస్థాన్ రాయల్ స్పిన్నర్ అశ్విన్ తన ఛానల్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. అదేవిదంగా క్రికెటర్ మైఖేల్ వాన్ , ఆడమ్ గిల్ క్రిస్ట్ తాము ప్రారంభించిన ఛానల్ తో అభిమానులతో నిత్యం సందడి చేస్తున్నారు. క్రికెటర్లు ప్రారంభించిన ఛానల్ల ద్వారా అభిమానులు ఆస్వాదిస్తున్నారు. కొత్త కొత్త క్రికెట్ విషయాలు తెలుసుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తోటి క్రికెటర్లు అందించిన విదంగానే బుమ్రా కూడా ఎదుగాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-