govt job : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ( నాబార్డ్ ) సంస్థ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ సంస్థ అయిన నాబార్డు లో 108 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఈ 108 పోస్టులన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు కావడం విశేషం. పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఇస్తూ నాబార్డ్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగానికి ఎంపికయిన వారు పర్మినెంట్.
ప్రతి నెల వేతనం 35 వేలు. 18 నుంచి 30 ఎల్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఆన్ లైన్ లో అక్టోబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ అక్టోబర్ 21. ఉద్యోగానికి ఎంపిక కు సంబంధించిన వివరాల కోసం నాబార్డ్ సంస్థ కు చెందిన అధికారిక వెబ్సైట్ ను చూడాలి.