కోల్ బెల్ట్ ప్రతినిధి:
పార్లమెంట్ పండుగ దేశవ్యాప్తంగా ఆరంభమైనది.మొదటి విడత పోలింగ్ ఈ నెల 19న ముగిసింది. ఎన్నికల నిర్వహణ ఆరోగ్యకరమైన వాతావరణంలో పూర్తి చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తనదయిన శైలిలో ఏర్పాట్లు చేసింది. రోడ్ సౌకర్యం లేని ప్రాంతాలకు గుర్రాలు,ఒంటెల ద్వారా ఎన్నికల సామాగ్రిని తరలించారు. దట్టమైన అటవీప్రాంతంలోకి సిబ్బంది వెళ్ళడానికి హెలికాఫ్టర్ ద్వారా ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించారు.మావోయిస్టు ప్రాభల్యమున్న మారుమూల అటవీప్రాంతంలో ప్రజలు స్వచ్చందంగా ఓటు వేయడానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. అవసరానికి మించి పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు.మావోయిస్టు పిలుపును ఖాతరు చేయకుండా ఆ రాష్ట్రంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.పలు మారుమూల ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అనుకున్నంత జరుగలేదు.కానీ ఆ ఒక్క ఊరిలో మాత్రం ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
పువర్తి గ్రామస్తులు ఓటు వేయలేదు….
బీజాపూర్ జిల్లా సరిహద్దులో సుక్మా జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో పువర్తి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు,దాడుల వ్యూహకర్త అయినటు వంటి హిద్మ స్వగ్రామం. ఆ ఊరిలో 332 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తిగా గిరిజన గ్రామం. దట్టమైన మారుమూల అటవీ ప్రాంతం. అయినప్పటికిని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేసింది.332 ఓటర్లలో ఈ ఒక్కరు కూడా ఆ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేదు.ఒకవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలిపు ఇవ్వగా, ఎన్నికలను నిర్వహించి పోలింగ్ శాతం పెంచాలనే పట్టుదలతో ముందస్తుగా క్యాంపు ఏర్పాటు చేశారు.ప్రాణభయంతోనే పువర్తి గ్రామస్తులు ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు సమాచారం.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-