Home » భావ కళ్ళల్లో ఆనందం కోసమే సస్పెండ్ చేసారా ???

భావ కళ్ళల్లో ఆనందం కోసమే సస్పెండ్ చేసారా ???

నేను పక్కా లోకల్
నా విశ్వరూపం చూపిస్తా
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావు
కోల్ బెల్ట్ ప్రతినిధి:
నీతి కథలతో నిందలు వేసినవేరికి సమాధానం చెప్పాడు.సినిమా డైలాగులు విసురుతూ సస్పెండ్ చేసినవారిపై శివుని అవతారం ఎత్తాడు. నేను ఎక్కడివాన్నో కాదు.పక్కా లోకల్ మనిషిని. శాశ్వతంగా ఇదే ప్రాంతంలో ఉంటా. ఇప్పటి నుంచి నా విశ్వరూపం ఎలా ఉంటదో నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరు చూసితీరుతారు.నా విధినిర్వహణలో తప్పులు తీసింది ఏ సైకో నాయకుడి కోసం తీశారు.ఏ భావ కళ్ళల్లో సంతోషం చూడటానికి నన్ను బలిచేసారు. ఏ శాడిస్టు మనిషి కోసం నేను చేయని తప్పుకోసం నన్ను విధుల నుంచి తొలగించి సంతృప్తి పొందారు.నా సీనియారిటీలో ఎన్నో బ్యాచ్ లను చూసా. కానీ అందులో మీ అంత దద్దమ్మలను చూడలేదు.ఎంతో మంది అధికారులు నావద్ద శిక్షణ పొందారు.ప్రభుత్వాలు ఎప్పుడు ఒకేవిదంగా ఉండవు.ఎప్పుడు ఉంటాయో,ఎప్పుడు కూలిపోతాయో వాళ్ళకే తెలియవు. వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళే కూలగొట్టుకుంటారు. ప్రభుత్వాల్లో అధికారుల జోక్యం ఉండరాదు.మనకు ప్రజలు శాశ్వతం.ప్రజలు చేసిన చట్టాలు శాశ్వతం. నాయకులకు తొత్తుగా వ్యవహరించరాదు అంటూ తన తప్పు లేకున్నా తప్పులతో తయారు చేసిన రికార్డు ఆధారంగా సస్పెండ్ కు కారకులైన అధికారులపై ఆంధ్ర ప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావ్ ఆగ్రహంతో ఊగిపోయారు.

అధికారం ఎవరి సొత్తు కాదు…
ప్రజలు ఇచ్చిన అధికారం ఎవరిసొత్తు కాదు.అధికారంపై ప్రజలకే హక్కు ఉంటుంది.అధికారులు ప్రజలకు జవాబు చెప్పాల్సిన భాద్యత అధికారులపైననే ఉంటది.కొందరు చీఫ్ సెక్రటరీలు అధికారం మాదే, ప్రభుత్వాలు మా చేతిలోనే ఉంటాయని భావిస్తారు. ఆ విధానం సరికాదు.ఎవరైనా నివేదికలు తయారు చేస్తే అందులో కనీసం అక్షర దోషాలు,వ్యాకరణ దోషాలు సరిచుకోవాలి. తనపై ఇచ్చిన తప్పుడు నివేదికలో కనీసం అలాంటివి కూడా చూడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.చివరకు తనపై కేంద్రానికి పంపిన ఫైల్ లో కూడా తప్పుల తడక ఉన్నదంటే వారి తెలివితేటలు ఏ మేరకు ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదన్నారు.

అధికారులు ప్రజల కోసమే ….
అధికారులు ఉన్నది ప్రజల కోసమే కానీ రాజకీయ నాయకుల కోసం కాదు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి.నాయకుల అభివృద్ధి కోసం కాదు.నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తూ పనిచేస్తే ప్రజలు కష్టాల పాలవుతారు. నాపై తప్పుడు నివేదికలు తయారుచేసి సస్పెండ్ చేయించారు.కోర్ట్ కు వెళ్ళా. హై కోర్ట్ నా నిజాయితీ కె మద్దతు పలికింది. చేతకాని మీరు సుప్రీం కోర్ట్ కు వెళితే అక్కడ కూడా కోర్ట్ తీర్పు నాకే అనుకూలంగా వచ్చింది. మొత్తం మీద రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలో నాపై కక్ష గట్టి ఏమి సాధించారు.చట్టం దృష్టిలో మీ నివేదికలు తప్పు అని తేలినవి.నేను నిజాయితీ పరుణ్ణి అయ్యాను అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతోపాటు ఆయన సస్పెండు కు కుట్ర పన్నిన కొందరి అధికారులపై సుప్రీం కోర్ట్ తీర్పు అనంతరం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావ్ ఈ విదంగా మాట్లాడిన మాటలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *