కోల్ బెల్ట్ ప్రతినిధి :హైదరాబాద్
ఒకప్పుడు సినిమాలు వంద రోజులు ఆడేవి. సినిమా కథ బాగుంటే 200 రోజులు కొనసాగేవి.365 రోజులు ఆడిన సినిమాలు ఉన్నవి.స్వర్గీయ ఎన్టీరామారావు సినిమా అడవిరాముడు 365 ఆడింది.చిరంజీవి, కృష్ణంరాజు,కృష్ణ,శోభన్ బాబు సినిమాలు కూడా వంద నుంచి 365 రోజుల నడుమ ఆడిన రోజులు ఉన్నవి. కానీ నేటి సినిమాలు ఎన్ని రోజులు ఆడింది అనేది లెక్కపెడుతలేరు. ఎంత కలెక్షన్ సాధించింది అనేది ముఖ్యమైనది. ఇంకా చెప్పాలంటే పెట్టు బడి ఎంత. కలెక్షన్ ఎంత వచ్చింది. మిగిలిన లాభం ఎంత అనే లెక్కల్లో సినీ పెట్టుబడిదారులు మునిగిపోయారు.ఇటీవల విడుదలయిన సినిమాల్లో 50 రోజులు నడిచినట్టుగా ఎక్కడ కూడా కనబడలేదు.
2024 లో సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు ” గుంటూరు కారం ” సినిమా వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో ఘాటుఘాటుగా గుంటూరు కారం విడుదల అయ్యింది.150 కోట్ల బడ్జెట్ తో సినిమాను భారీ అంచనాలతో నిర్మించారు.సినిమా విడుదల అయిన మొదట పాజిటివ్,నెగిటివ్ లను మూటగట్టుకుంది.అయినప్పటికీ మహేష్ బాబు సుతిమెత్తని పంచ్ లతోపాటు ప్రభుదేవ డాన్స్ లను మయిమరిపించే రీతిలో శ్రీ లీల చేసిన డాన్స్ లతో దియెటర్లు ఈలలు,గోలలు,కేరింతలతో నిండుకున్నాయి. ” ఆ కుర్చీని మడత పెట్టి ” పాట ఒక్క మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మారుమోగుతోంది. ఇతర దేశాల్లో ప్రారంభోత్సవాలకు కూడా ఇదే పాట మొదలుపెట్టి ప్రారంభోత్సవం చేయడం విశేషం.
150 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసి 184 కోట్ల రూపాయలకు చేరుకొంది. అంతేకాదు గుంటూరు కారం సినిమా వందరోజుల పండుగకు కూడా ముస్తాబయింది.ఇంత పెద్ద పోటీలో కూడా ఈ సినిమా వంద రోజులు నడవడం, 184 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించడంతో సినీ ఇండస్ట్రీలో ఆనందం వ్యక్తం అవుతోంది.సినీ తారాగణం తోపాటు దర్శక,నిర్మాతలు, సాంకేతికవర్గం అంత కూడా సంతోషంలో మునిగిపోయారు. చిలకలూరి పేటలోని వెంకటేశ్వర్ తియేటర్లో నూరు రోజులు ఆడింది. అదేవిదంగా ముల్బగల్ పట్టణంలోని నటరాజ్ సినీ కాంప్లెక్స్ లో ప్రతిరోజు నాలుగు ఆటలు ప్రదర్శిస్తూ వందరోజులు ఆడింది. వందరోజులు పూర్తి చేసుకున్న సినిమా థియేటర్లో పండుగ చేసుకోడానికి మహేష్ బాబు అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం విశేషం.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-