Home » congress : కాంగ్రెస్ తో ఆ పార్టీ దోస్త్ కటీఫ్ .

congress : కాంగ్రెస్ తో ఆ పార్టీ దోస్త్ కటీఫ్ .

congress : హర్యానా లో విజయాన్ని ముద్దాడాల్సిన కాంగ్రెస్ పార్టీ చేజేతులారా పోగొట్టుకుంది. ఒంటరిగా బరిలోకి దిగింది. పరాజయాన్ని మూటగట్టుకుంది. మితిమీరిన ఆత్మ విశ్వాసమే కొంప ముంచిందినే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పరాజయంతో ఏమి మాట్లాడాలో తెలియక ఏవిఎం లపై నింద వేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇంటిలో ఉన్న తప్పులు దిద్దుకుంటే పార్టీ కి భవిష్యత్తు ఉంటుందని రాజకీయ పండితులు సలహాలిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఈవీఎం లపై వేస్తున్న నిందలను ఇండియా కూటమిలోని పెద్దలు కూడా సమర్ధించక పోవడం విశేషం.

హర్యానా ఎన్నికల్లో కలిసి నడవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన బలంతో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తును తిరస్కరించింది. ఎం జరిగింది. చేతిలోకి వచ్చిన అధికారం కాస్తా జారిపోయింది. చివరకు ఈవిఎం లపై నిందలు వేస్తున్నారు కాంగ్రస్ పెద్దలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గా ఏర్పడి అంతలోనే ఆమ్ ఆద్మీ ని పక్కకు తోసివేయడంతో రాజకీయ వర్గాలు సైతం కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి.

ఇది ఇలా ఉండగా ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టిస్తూ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. ఢిల్లీ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని స్పష్టం చేస్తూ చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్న దోస్త్ కటీఫ్ అయిపోయింది. ఇందుకు ప్రధాన కారణం హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగడం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *