BRS KTR : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ సిపి. ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఏపీ లో గల్లీ, గల్లీ తిరిగారు. ఎన్నో మాయమాటలు చెప్పారు. ప్రజలు నమ్మారు. రాజకీయ పండితుడు చంద్రబాబును ఓడించాడు. ఏ ప్రజలైతే నమ్మారో, వాళ్లే జగన్ ఓడించారు. ఇలా జగన్ రాజకీయానికి ఒక చరిత్ర ఉంది. కానీ తెలంగాణ లో మాత్రం మేనేజ్ మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్ జగన్ ను అనుసరిస్తున్నట్టు కనబడుతోంది. కేటీఆర్ చెమట చుక్క రాల్చకుండా నేరుగా మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయ బెర్త్ పొందిన విషయం అందరికి తెలిసిందే.
ఇటీవల ఓటమి చెందేవరకు కూడా కేటీఆర్ రాజభోగం అనుభవించారు. ప్రతిపక్షం పదం గులాబీ డిక్షనరీ లో లేదు. ఆ పదం డిక్షనరీలో లేదు కాబట్టి ప్రభుత్వంలో ప్రతి విషయాన్నీ వ్యతిరేకించడమే అనుకుంటున్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా తప్పే అంటున్నారు. తప్పును తప్పు అనడం బాగానే ఉంది. కానీ తెలంగాణాలో ఏమి జరిగినా అందుకు రేవంత్ రెడ్డి భాద్యుడు అనడం, లేదంటే చేతకాని సీఎం అంటూ విమర్శలు చేయడంలో కూడా వెనుకాడటంలేదు కేటీఆర్.
ప్రభుత్వం హైడ్రా విషయంలో కఠినంగా ఉంది. ఈ అక్రమ నిర్మాణాల విషయంలో కూల్చి వేతలు తప్పు అని ఇప్పటివరకు ఎవరు కూడా అనడంలేదు. గతంలో కేసీఆర్ కూడా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని గట్టిగానే చెప్పారు. అప్పుడు ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు కేటీఆర్ చెప్పాలి. ఎందుకు ఆపారో చెప్పకుండా ఇప్పుడు అడ్డుకుంటాం అంటూ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరికలు చేస్తున్నారు. తండ్రి, కొడుకుల మాటలు వింటుంటే కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటలోనే నేటికీ రాజకీయ ఓనమాలు దిద్దుతున్నట్టుగా కనబడుతోందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూసీనది ఆక్రమణకు గురికావడంతో ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలు ఎంత బాధ అనుభవిస్తున్నారో అక్కడ ఉండే వారికీ తెలుసు. ఆక్రమణలు తొలగించి, నదికి పూర్వ స్థితికి తీసుకువచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ విషయంపై కూడా కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మొన్ననే అమృత్ విషయంలో మాట్లాడి బొక్కబోర్లా పడ్డారు కేటీఆర్. ఎవరు, ఎవరికీ చుట్టమో తెలియదు. వరుసలు తెలియకుండానే ఏకంగా సీఎం రేవంత్ డ్డి కి బంధుత్వాలను అంటగడుతున్నారు కేటీఆర్. దేవర సినిమా కు సంబంధించి ఒక హోటల్లో సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంది చిత్ర బృందం. అక్కడ చిన్న గొడవ జరిగింది. ఆ విషయానికి, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనకు ముడిపెట్టడం జరిగింది మేనేజ్మెంట్ కోటాలోనే కావడం విశేషం.
రేవంత్ రెడ్డి నేరుగా మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఆషామాషీ రాజకీయ నాయకుడు అంతకూ కాదు. జెడ్పిటీసి నుంచి వచ్చిన నాయకుడు. జిల్లా పరిషత్ లో ఏమి మాట్లాడాలో తెలుసు. ఎమ్మెల్సీ గా అనుభవం ఉంది. ఎమ్మెల్యే గ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అయినప్పుడు ఉమ్మడి తెలంగాణ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా కొనసాగుతోంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. సొంతంగా ఎదగాలని ఆశించాడు. ఎదిగాడు. ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన అనుభవాన్ని కొలిస్తే రేవంత్ రెడ్డి వద్ద టన్నుల కొద్దీ రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో కేసీఆర్ కు జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుభవాన్ని తక్కువ చేసి కొలిస్తే మాత్రం పాతాళంలోకి తొక్కడం ఖాయమనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.