Home » Tea & Coffee : నెల రోజులు టీ, కాఫీ, తాగకుంటే ఏమవుతుందో తెలుసా ???

Tea & Coffee : నెల రోజులు టీ, కాఫీ, తాగకుంటే ఏమవుతుందో తెలుసా ???

Tea & Coffee : ఉదయం నిద్ర లేచిందంటే కుదిరితే కప్పు కాఫీ. లేదంటే ఓ కప్పు టీ. రెండింటిలో ఎదో ఒకటి తాగాల్సిందే. కొందరు పళ్ళు తోమిన తరువాత తాగుతారు. మరికొందరు నిద్రలేచిందంటే రెండింటిలో ఎదో ఒకటి తాగేస్తారు. ఉదయం పూట టీ గాని, కాఫీ గాని తాగితేనే ఇతరత్రా పనుల్లోకి వెళుతారు. అప్పటి వరకు ఏ ఒక్క పని కూడా చేతపట్టరు. ఇది ప్రతిరోజూ చేసే పని.

కొందరు పని ఒత్తడికి టీ లేదా కాఫీ తాగుతారు. దాంతో మనసు ప్రశాంతగా ఉంటుందని తాగేవారు ఉంటారు. మరి కొందరు కనీసం రోజుకు మూడు నుంచి నాలుగు టీ లు తాగేవారు ఉంటారు. వాతావరణం కాస్త చలిగా ఉందంటే వేడి, వేడి టీ తాగుతారు. వాస్తవానికి కాఫీ లేదా టీ తాగితే మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాటిలో ఉండే కెఫీన్ అనారోగ్యానికి ప్రధాన కారణం. అందుకే వైద్యులు కాఫీ, టీ తాగడం మానివేయాలని చెబుతారు. వైద్యులు చెప్పినప్పటికిని మాని వేయడం మాతో సాధ్యం కాదని చెబుతుంటారు. కానీ ఒక్కటంటే ఒక్క నెల కాఫీ టీ మానివేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ??? ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్క నెల రోజులు కాఫీ, టీ మానివేసి చూడండి. ఎంత ఆరోగ్యముగా ఉంటారంటే, శరీరం చాలా ఉల్లాసంగా ఉంటుంది. రక్తపోటు ఉన్నవారికి అదుపులోకి వస్తుంది. నిద్ర లో చాలా మార్పులు జరుగుతాయి. హాయిగా నిద్రపోతారు. దంతాలు బలహీనమవుతాయి. దంతాల రంగు మారుతుంది.కొలెస్ట్రాలు అదుపులో ఉంటుంది. ప్రధానంగా శరీరం బరువు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *