Sleep : మంచంపై నిద్రపోడానికి వెళ్లారంటే ఏ దిక్కు అనేది చూడరు. ఏ దిక్కు అయినా పరవాలేదు. నిద్ర పోవాల్సిందే అంటారు కొందరు. కొందరు తూర్పు దిక్కున తల పెట్టి నిద్రపోతారు. కొందరు ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటారు. కానీ ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోతే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. తెలియకనే నిద్రపోతారు. ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోతే ఏమవుతుందో తెలుసుకుందాం.
పద్ధతులు, వేదం గురించి పట్టించుకోని వారు ఉత్తరం వైపు తలపెట్టి పట్టుకుంటారు. ఉత్తరం వైపు యమదూతలు ఉంటారు. కాబట్టి అశుభం కు సంకేతం అవుతుంది. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోరాదని సైన్స్ కూడా చెబుతోంది. ఆ దిక్కున పడుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు అనారోగ్యపాలవుతారని సైన్స్ నిపుణులు చెబుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది
దక్షిణ, ఉత్తర దిశల వైపు తల పెట్టుకుని పడుకుంటే భూ అయస్కాంత ప్రభావం పడుతుంది. ఈ కారణంగా శరీరంలో జరిగే రక్త ప్రసరణలో అనేక హెచ్చుతగ్గులు మొదలవుతాయి. ఉత్తర దిక్కున నిద్ర పోతే నిద్ర కూడా సరిగా పట్టదు. తల నొప్పి, నిద్రలో అప్పుడప్పుడు మెలుకువ కూడా వస్తుంది.