MSME Loans : మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్నారా. అయితే మీ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (MSME) ద్వారా రుణం పొందదానికి ప్రకటన విడుదల అయ్యింది.ఈ రుణంతో మీ వ్యాపారాన్నిఅభివృద్ధి చేసుకోవచ్చు. కొత్త యంత్రాలను కొనుగోలు చేసుకోడానికి కూడా అవకాశం ఉంది. ఎలాంటి గ్యారంటీ అవసరం లేకుండానే ఎంఎస్ఎంఈ లోన్ పొందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడి రుణం మంజూరవుతుంది.
నిబంధనలు ….
వడ్డీ రేటు సంవత్సరానికి 8.75 శాతం వరకు నిర్ణయిస్తారు. ఈ రుణం తీసుకోడానికి మహిళలు, పురుషులు అర్హులు. 2 కోట్ల లోపు ఎంతయినా తీసుకోవచ్చు. రుణంపై 3 శాతం ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకు అధికారులు వసూలు చేస్తారు. తీసుకున్న రుణాన్ని 12 నెలల నుంచి 15 సంవత్సరాల్లో చెల్లించదానికి అవకాశం ఉంది. ఒకేసారి చెల్లించాలనే నిబంధన లేదు. ప్రతినెల చెల్లించాల్సి ఉంటుంది.
రుణంకు కావాల్సిన అర్హతలు….
రుణం కోసం ధరఖాస్తు చేసుకున్నవారికి క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ తప్పనిసరి. మీరు చేస్తున్న వ్యాపారంలో నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం రావాలి. కనీస టర్నోవర్ రూ.10 లక్షలు ఉండాలి. గతంలో ఏదయిన బ్యాంకు నుంచి లోన్ తీసుకొని చెల్లించని వారికి ఇక్కడ రుణం రాదు. చేస్తున్న వ్యాపారం కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి. కనీస వయసు 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ధరఖాస్తు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో …..
ఈ రుణం కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు విధాలుగా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లి.. MSME లోన్ ప్రోగ్రామ్ ను ఎంపిక చేసుకోవాలి. “Apply” అనే బటన్ పై క్లిక్ చెయ్యాలి. వివరాలు నమోదు చేసి, సబ్‌మిట్ ఎంట్రీ చేయాలి. తర్వాత బ్యాంక్ ప్రతినిధి మీకు ఫోన్ చేసి మాట్లాడుతారు. మీరు సమర్పించాల్సిన పత్రాల వివరాలను వివరిస్తారు. వాటిని మీరు సంబంధిత బ్యాంకు అధికారికి అందజేసిన తరువాత పరిశీలిస్తారు. పరిశీలనలో మీరు ఎంపిక అయిన తరువాతనే మీకు రుణం,మంజూరు అవుతుంది. మీతో ఒక రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేయించుకుంటారు. ఇవన్నీ పూర్తయిన తరువాత 48 గంటల్లో మీ అకౌంట్‌లో రుణం ఎమౌంట్ జమ అవుతుంది.