Red Amaranth : శరీరానికి అనేక వేదాలుగా ఆకుకూరలు ఉపయోగపడుతాయి. కావలసినన్ని విటమిన్ లు ఉంటాయి. మాంసాహారం కంటే ఎక్కువ శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. గోంగూర, పాలకూర, చుక్కకూర, పచ్చ తోటకూర, బచ్చలి కూర ఎక్కువగా తింటారు. కానీ ఎర్ర తోటకూర తినేవారు చాలా తక్కువ. చాలా మందికి ఎర్ర తోటకూర ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం దివ్యౌషధం లా పనిచేస్తుందని అంటున్నారు.
ఎర్ర తోటకూర తినడం వలన రక్తహీనత సమస్య తొలగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక వ్యాధులు నయమవుతాయి. షుగర్ అదుపులోకి వస్తుంది. కాల్షియం లభిస్తుంది. ఎముకల్లో మూలుగ పెరుగుతుంది. తద్వారా ఎముకలు బలంగా తయారవుతాయి.
కావాల్సినంత పొటాషియం శరీరానికి అందుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. చర్మవ్యాధులు సోకవు. గాయాలు తొందరగా నయమవుతాయి.