Dryfruits : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా మంది ఈ రోజుల్లో మిల్లెట్స్ తింటున్నారు. అంతే కాకుండా డ్రైఫ్రూప్ట్స్ కూడా తింటున్నారు. డ్రై ఫ్రూప్ట్స్ తింటే మంచిదా ? కాదా ? ఎంత తినాలి. రోజులో ఎంత తినాలి. అసలు డ్రైఫ్రూప్ట్స్ లో ఏమి తినవచ్చు. ఏమి తినరాదు. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు తినవచ్చా ? తినరాదా ? ఎక్కువగా తింటే ఏమవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం …..
మన శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచడంతో పాటు అవసరమైన పోషకాలను అందించడంలో డ్రై ఫ్రూప్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నిత్యం తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుంది. గుండె సమస్యల్ని నిరోధిస్తుంది. డ్రై ఫ్రూట్స్ తినడంలో సమయం పాటించాచడం కూడ తప్పనిసరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి సమయంలో ఎక్కువగా తింటే శరీరంలో ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతుంది. ఆరోగ్యంపై కూడా ఎక్కువగా తింటే ప్రభావం చూపుతుంది. అందుకనే అధికంగా తినరాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా శరీర బరువు కూడా పెరుగుతుంది. రాత్రి సమయంలో ఎక్కువగా తింటే జీర్ణ సమస్య కూడా ఎదురవుతుంది. దింతో శరీరం అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి పూట ఎక్కువగా తింటే జీర్ణం కాకపోవడంతో మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.