Home » Ministers : ఆ రాష్ట్ర మంత్రులందరూ కలిసి ఒకేసారి ఏమిచేసారో తెలుసా ?

Ministers : ఆ రాష్ట్ర మంత్రులందరూ కలిసి ఒకేసారి ఏమిచేసారో తెలుసా ?

Ministers : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ లో మహా కుంభమేళా జరుగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తితో నిండుకున్న ఆ పుణ్యనదిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళా పై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.

ఇంత భారీ ఎత్తున కుంభ మేళా జరుగుతుంటే ఆ రాష్ట్ర మంత్రులు అందరు కలిసి కట్టుగా ఒక ఆశ్చర్య కరమైన సంఘటన తీసుకురావడం విశేషం. ఉత్తరప్రదేశ్ మంత్రి వర్గం అంతా కలిసి ఒకేసారి పవిత్రమైన గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. మంత్రులందరితో కలిసి సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం బ్రిజేష్‌ పాఠక్‌ కూడా స్నానం చేయడం విశేషం.

54 మంది మంత్రులు కలిసి స్నానం చేయడం తో అక్కడ భక్తులందరిని ఈ సన్నివేశం విశేషంగా ఆకట్టు కొంది. గంగానదికి హారతి ఇచ్చారు. వేదపండితుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ప్రసాదం పంపిణి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *