Ghee Benefits : భోజనంలో తప్పనిసరిగా చాలా మంది నెయ్యి వాడుతారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు. కొందరు మూడు కాలాల పాటు భోజనంలో నెయ్యి వాడుతారు. ఇప్పడు వర్షాకాలం నడుస్తోంది. ఈ కాలంలో నెయ్యి వాడితే శరీరానికి మంచిదా ? కాదా ? ఇప్పడు తెలుసుకుందాం.
చర్మ సమస్యలు వర్షాకాలంలో ఎదురవుతాయి. దురద, దద్దుర్లు, మొటిమ వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతాయి. తేమ శాతం వర్షాకాలంలో గాలిలో ఎక్కువగా ఉంటది. ఆ కారణంతో చర్మ సమస్యలు ఎదురవుతాయి. చర్మంపై దురద, దద్దుర్లు వంటివి ఏర్పడినప్పుడు వాటిపై నెయ్యి రాసినచో చర్మ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో పాదాలను కాపాడుకోవడం తప్పనిసరి. కొందరికి పాదాలు ఎప్పటికి పగుళ్లతోనే ఉంటాయి. పాదాలు పగిలిన చోట నెయ్యి రాసినచో మంచి ఫలితం ఉంటది. శిరోజాలు మృదువుగా,కాంతివంతంగా ఉండటానికి నెయ్యి పనిచేస్తుంది. కొబ్బరినూనెలో నెయ్యి కలిపి జుట్టుకు రాసి అర్థగంట పాటు ఉంచాలి. ఆ తరువాత షాంపు తో స్నానం చేసిన తరువాత జుట్టు కాంతివంతంగా మెరిసిపోతుంది.