Doctor visit : ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళగానే డాక్టర్ నాడి, గుండె కొట్టుకునే విధానాన్ని పరీక్షిస్తాడు. ఆ తరువాత నాలుక చూపించ మంటాడు. డాక్టర్ నాలుక చూపించమని ఎందుకు అంటాడో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాని తెలుసుకుందాం.
నాలుక రంగు చూసి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి చెప్పవచ్చు. నాలుక రంగు శరీరంలోని పలు వ్యాధులను తెలుపుతుంది. నాలుకపై తెల్లటి మచ్చలు పిల్లలు, వృధులల్లో కనిపిస్తాయి. ఒకవేళ నాలుకపై తెల్లటి మచ్చలు ఉంటె ఈస్ట్ ఇన్ఫెక్షన్ గా డాక్టర్ గుర్తిస్తారు. నాలుక నలుపు రంగుగా మారితే గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అదేవిదంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల నాలుక నల్లగా . క్యాన్సర్ రోగుల్లోనూ నాలుక నల్లగా నే కనబడుతుంది.
అదే విదంగా కడుపులో పూతల సమస్యలతో బాధపడేవారి నాలుక కూడా నల్లగానే కనబడుతుంది. పసుపు రంగులో కనబడితే కామెర్ల లక్షణం. నీలం, గోధుమ రంగు లో కనబడితే చాలా ప్రమాదకరం. గోధుమ రంగు కనబడితే గుండె సమస్య ఏర్పడినట్టు. శరీరంలో రక్తం తక్కువగా ఉంటె నాలుక లేత గులాబీ రంగులోకి మారుతుంది. విటమిన్ లోపం వలన కూడా నాలుక గులాబీ రంగులోకి మారుతుంది.
ఇది చదివిన తరువాత చాలా మందికి ఒక అనుమానం కలుగుతుంది. ఆరోగ్యవంతుడి నాలుక ఎలా ఉంటుంది అనే సందేహం కలుగుతుంది. వైద్యుల అభిప్రాయం మేరకు ముదురు గులాబీ రంగులో లేత తెల్లటి పూతతో, ఎలాంటి మచ్చలు లేకుండా నాలుక ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యముగా ఉన్నట్టు