Curd : భోజనంలో చివరి ముద్ద పెరుగుతో తింటేనే చాలా మందికి తృప్తి అవుతుంది. పెరుగు లేకుండా భోజనం చేయడమనేది చాలా మందికి ఇష్టముండదు. చివరగా ఎవరైన పెరుగు ఉందా అని అడుగుతారు. పెరుగు లేదంటే అసంతృప్తికి లోనవుతారు. కానీ చలికాలంలో రాత్రి పూట పెరుగు తింటే శరీరంలో ఏమిజరుగుతుందో చాలా మందికి తెలియదు. తింటే ఏమవుతుందో తెలుసుకుందాం….
జీర్ణ సమస్యలు ఉన్నవారు చలికాలంలో రాత్రి పూట పెరుగు తినరాదు. పెరుగు లో ప్రోటీన్, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి తొందరగా జీర్ణం కావు. కాబట్టి జీర్ణ సమస్య ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినరాదు. చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట పెరుగు తింటే తొందరగా జలుబు, దగ్గు, తుమ్ములు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చలికాలంలో రాత్రిపూట పెరుగు తినరాదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
పెరుగు పగటి పూత మాత్రమే తినాలి. జీర్ణకోశ సమస్య ఉన్నవారు మధ్యాహ్న బొజనంలోనే పెరుగు వాడాలి. అప్పుడే తొందరగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్య లేనివారు ఏ కాలంలో అయినా, ఏ సమయంలో అయినా పెరుగు తినడానికి ఇబ్బంది ఉండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెన్న తీసిన పాల నుంచి తయారు తయారుచేసిన పెరుగు తింటే ఆరోగ్యముగా ఉంటారు. బరువు పెరగరు. బరువు తగ్గాలనుకునే వారు వెన్న తీసిన పాలతో తయారైన పెరుగు తింటే తొందరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.