Health : నిత్యం మనం తినే ఆకుకూరలు, కూరగాయలు మన శరీరాన్ని కాపాడుతాయి. ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్య పరంగా రక్షణ ఇస్తుంది. క్యాబేజి కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శరీరానికి కూర రక్షణ ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. గుండె, క్యాన్సర్ సమస్యల నుంచి కాపాడుతుంది. మధుమేహం బాధితులకు రక్షణగా ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ కే, సీ అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికీ ఎంతో ఉపయోగ పడుతుంది. శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
డయాబెటిక్, థైరాయిడ్ సమస్యలను సైతం నివారిస్తుంది. రోగనిరోధక శక్తి ని పెంచే గుణం క్యాబేజీలో ఉంది. బీపీ ని అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యముగా ఉంచడంలో దోహదపడుతుంది. క్యాబేజీలో ఉండే పోషకాలు, విటమిన్ ల గురించి తెలిసిన వారు క్రమం తప్పకుండ తింటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.