venki : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ హీరో వెంకటేష్ విజయాలకు దూరంగానే ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం విడుదలకు సిద్దమైనది. సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. సినిమా విడుదల కు సిద్ధం కావడంతో వెంకటేష్ అభిమానుల్లో గుబులు మొదలైనది. సినిమా విజయంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇటీవలనే విడుదలైన పుష్ప-2 భారీ విజయంతో దూకుడుగా ఉంది. తాజాగా గేమ్ చెంజర్ కూడా వసూళ్లను భారీగానే రాబట్టే దిశలో ఉందని చిత్రపరిశ్రమలో టాక్ వస్తోంది. బాలయ్య సినిమా కూడ సంక్రాంతికి రాబోతోంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రాబోతోంది. వీటికి గట్టి పోటీ విక్టరీ వెంకటేష్ సినిమా ఇవ్వనుందా అనే అనుమానాలు సైతం వెంకటేష్ అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
అయితే పుష్ప-2, గేమ్ చేంజర్ , బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిచినవి కావడం విశేషం. వీటికి పోటీగా రాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. అంతే కాదు కేవలం 74 రోజుల్లోనే సినిమా పూర్తి చేశారు. తక్కువ బడ్జెట్ సినిమా. ఈ సినిమా విజయం సాదిస్తుందని, అంతే కాకుండా పెట్టిన పెట్టుబడితో పాటు అధిక లాభాలు కూడా వస్తాయని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం ఆశిస్తోంది. ఈ సినిమాతో వెంకటేష్ కు అదృష్టం కలిసి వస్తుందని కూడా చిత్ర బృందం అభిప్రాయపడుతోంది.