Allu Arjun : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సంధ్య థియేటర్ ఘటనతో పడిన ఇబ్బందులు ఆయన తన జీవితంలో మరచిపోవడం కష్టమే. అత్యధిక వసూళ్లు చేసి దేశంలోనే ప్రథమ సినిమాగా పుష్ప-2 రికార్డ్ సృష్టించింది. ఆ సంఘటన తో పుష్ప-2 విజయాన్ని సైతం ముద్దాడ లేకపోయారు. ఇంతటి మానసిక ఒత్తిడిలో కూడా అల్లు అర్జున్ ముంబై వెళ్లారు. ముంబై వెళ్లిన విషయం తెలియడంతో అభిమానులు సైతం ఆరాతీస్తున్నారు.
ప్రముఖ హిందీ చిత్ర పరిశ్రమ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తీరిక లేకుండా ఉన్నారు. భన్సాలీ ముంబైలోనే ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ భన్సాలీ లవ్ అండ్ వార్ సినిమాను రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తో భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లోపు ఆ సినిమాను విడుదల చేయడానికి భన్సాలీ సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర బృంద సమాచారం.
భారీ బడ్జెట్ తో భన్సాలీ లవ్ అండ్ వార్ సినిమాను నిర్మిస్తున్న క్రమంలోనే హీరో అల్లు అర్జున్ ఆయన కోసం ముంబై వెళ్ళాడు. ఆయన వద్ద ఉన్న ఒక కథ వినడానికే అల్లు అర్జున్ వెళ్లినట్టు సమాచారం. ఆ కథ నచ్చితే అల్లు అర్జున్ అంత పెద్ద డైరెక్టర్ తో సినిమా తీసే అవకాశాలు ఉన్నాయని తెలుగు పరిశ్రమలో పెద్ద టాక్. అయితే అల్లు అర్జున్, భన్సాలీ వీరిద్దరిలో ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటిస్తే కానీ అసలు విషయం బయట పడదు. అప్పటి వరకు బన్నీ అభిమానులకు టెన్షన్ తప్పదు.