Heroyin : ప్రేమించుకుంటారు… పెళ్లి చేసుకుంటారు. మరికొందరు చిన్న, చిన్న కారణాలతో విడిపోతుంటారు. ప్రియురాలు అనారోగ్యానికి గురైతే వదిలేసినవాళ్లు ఉన్నారు. సేవలు చేసిన వాళ్లు ఉన్నారు. ఆ సేవలు చేసింది ఎవరికో కాదు. ఒక సినిమా హీరోయిన్ కు ఆమె ప్రియుడు చేస్తున్న సేవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ హీనా ఖాన్ కు ఇటీవల క్యాన్సర్ వ్యాధి సోకింది. చికిత్స కూడా తీసుకొంటోంది. ఈ సమయంలో ఆమె ప్రియుడు రాకీ జైస్వాల్ సేవలు చేయడానికి ముందుకు వచ్చాడు. నిరంతరం ఆమె వెంట ఉంటూ హీనా ఖాన్‌కు సేవలు చేస్తున్నాడు. రాఖి సేవలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్బంగా హీరోయిన్ హీనా ఖాన్ స్పందించింది. నన్ను వదిలించుకోడానికి అనేక కారణాలు ఉన్నవి. అయినా నాకు అండగా నిలిచాడు. నేను ఎంత చేసినా రాఖీ జైస్వాల్ ఋణం తీర్చుకోలేను. దుఃఖంలో ఉన్న నన్ను ఆదుకున్న నా రాఖీ కి ఏమిచ్చినా తక్కువే అంటూ హీనా ఖాన్ ఆవేదనతో సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.