Ayodya : కోట్లాది మంది హిందువుల ఆరాధ్య విశ్వాస దేవుడు…. రామ భక్తుల కళలు నిజమైన వేల … 2024, జనవరి 22న అయోధ్య రామ మందిరానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చిన రోజు….అయోధ్య రాముడి మందిరం ప్రతిష్టాపన జరిగిన రోజు. దివ్యమైన అయోధ్య మందిరంలో బాల రాముడు కొలువుదీరి తరళి వచ్చిన భక్తులను ఆశీర్వదించిన రోజు. ఆ రోజు మరచిపోనిది. మరపురానిది.
అంతటి గొప్పనైన రోజు మరోసారి రానే వచ్చింది. అంటే ముందుగానే వచ్చేసింది. వేద శాస్త్రం ప్రకారం ముందస్తుగానే ఆ అయోధ్య బాల రాముడి వార్షికోత్సవం. 2024, జనవరి 22న రామ లల్లా మూర్తి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అయితే ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని మాత్రం ఈ ఏడాది జనవరి 11న రామమందిరంలో జరిపిస్తున్నారు. వేద పండితులు, జ్యోతిష్యులు దీనికి కారణం ఉందంటున్నారు.
గతేడాది పుష్య శుక్ల ద్వాదశి నాడు అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ శుభదినాన్ని ప్రతిష్ఠ ద్వాదశి గా జరుపుకోవాలని రామ జన్మభూమి ట్రస్టు పిలుపునిచ్చింది. 2025, జనవరి 11న పుష్య శుక్ల ద్వాదశి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాలు వేడుకగా అయోధ్యలో ట్రస్ట్ వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. జనవరి 11 నుంచి 13 వరకు బాల రాముడి మహా క్రతువుని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆలయ ట్రస్టు, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను భారీ ఎత్తున పూర్తి చేసింది.