Mega Family : అందాల రాక్షసి తెలుగు సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో హీరోయిన్ గ అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకొంది. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్లింది. 2017 లో మిస్టర్ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరసన నటించింది. అక్కడే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి ప్రేమ ఏడడుగులు నడిపించింది. ఇటలీలో మెగా కుటుంబం అంతా కలిసి 2023 నవంబర్ 5న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇటీవల మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల్లో లావణ్య తల్లి కాబోతున్నదనే భావం కనబడుతోంది. వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తాత కాబోతున్నారని తెలుగు సినీ పరిశ్రమలో ఈ వార్త గుప్పుమంది. ఈ నేపథ్యంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఒక ఫోటో తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లావణ్య త్రిపాఠి ఇటీవల ఒక బాబును ఎత్తుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన అభిమానులు ఆమె తల్లి కాబోతున్న విషయం చెప్పకనే చెప్పిందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కానీ, వరుణ్ తేజ్ కానీ స్పందించాల్సి ఉంది. మెగా కుటుంబలో ఎవరైన స్పందించాల్సి ఉంది. అప్పుడే ఆమె తల్లి కాబోతున్న విషయం స్పష్టం అవుతుంది. అప్పటి వరకు మెగా అభిమానులు వేచి ఉండాల్సిందే.