Home » Puspa -2 : పుష్ప-2 విడుదల అందుకే వాయిదా పడింది.

Puspa -2 : పుష్ప-2 విడుదల అందుకే వాయిదా పడింది.

Puspa -2 : 2024 సంవత్సరంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా అవైటెడ్ మూవీస్ లో ఒకటి కావడం విశేషం. అర్జున్ అభిమానులు ఈ సినిమా విడుదల ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై సుకుమార్ ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడిదారులు షూటింగ్ లో ఎక్కడ కూడా ఖర్చు కోసం వెనుకాడటం లేదు. హీరో అర్జున్ సరసన రస్మిక మరోసారి తన హావభావాలతో అభిమానులను ఊరించడానికి సిద్దమయ్యింది. ఆగష్టు 15న సినిమాను విడుదల చేయడానికి సినిమా పెట్టుబడిదారులు సిద్ధమయ్యారు.

ప్రత్యేక పాత్రలో నటించిన అనసూయ పుట్టినరోజు ఇటీవలనే జరిగింది. ఆమె పుట్టినరోజు పురస్కరించుకొని ప్రత్యేక లుక్ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎక్కడ కూడా సినిమా నిర్మాణంలో వెనక్కి తగ్గేలే అంటున్నారు. సినిమా విడుదల గురించి అనేక పుకార్లు వచ్చాయి. దీనితో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అయ్యింది. కానీ సాంకేతిక బృందం, మైత్రి మూవీ వారు మాత్రం సినిమా విడుదల వాయిదా ఉండదని ఇటీవల స్పష్టం చేసింది. అయినా సినిమా వాయిదా తప్పదనే ప్రచారం మొదలైనది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు అయోమయంలో పడ్డారు.

సినిమా ఎడిటింగ్ ను పెట్టుబడిదారులు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎడిటింగ్ లో మార్పులు చేయనున్నట్టు చిత్ర పరిశ్రమ సమాచారం. ఎడిటింగ్ చేస్తున్న ఆంటోని రూబెన్ వలన కొన్ని ఇబ్బందులు వచ్చినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. మిగిలిన ఎడిటింగ్ పూర్తి చేయడానికి నవీన్ నూలిని ని కొత్తగా తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఆయన ఎంపికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఎడిటింగ్ సమస్యతోనే పుష్ప-2 సినిమా వాయిదా పడుతుందా ? లేదంటే సకాలంలో పూర్తి చేసి అభిమానులకు కానుకగా అందిస్తారు అనేవి వేచి చూడాల్సిందే.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *