Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు కావడం, ఒకరోజు జైల్లో ఉండటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. శుక్రవారం ఆయన బెయిల్ మంజూరు కోసం వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్ట్ ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదయినది విదితమే. నాంపల్లి కోర్ట్ విధించిన రిమాండ్ ముగిసింది. దింతో ఆయనకు బెయిల్ వస్తుందా ? రాదా అనే సందిగ్ధంలో పడ్డారు ఆయన అభిమానులు.
రిమాండ్ ముగిసిన నేపథ్యంలో అల్లు అర్జున్ కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు. ఆయన న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కోసం పిటిషన్ దాఖలు చేసారు. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్ట్ శుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.