horse : గుర్రం పై ఉన్న అమ్మాయిని గుర్తుపట్టలేరు. ఎందుకంటే చాలా రోజులైనది. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే కొద్దిగా కష్టపడల్సిందే. ఎందుకంటే ఆమె చేతిలో సినిమాలు ఉన్నన్ని రోజులు తన అభిమానులను మత్తెక్కించింది.
ఇప్పటివరకు ఆమె నటించిన పలు సినిమాలు అభిమానులు ఆశించిన మేరకు విజయం సాధించలేదు. అయినా ఆమె క్రేజీ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ స్పీడ్. తన గ్లామర్ ఫొటోలతో నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు. సమయం ఎందుకు వృధా చేయడమని ఇప్పుడు ఆ అందాల భామ గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు. 2021లో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కేతిక శర్మ . రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం. లక్ష్య అనే సినిమాలో నటించినప్పటికీ ఆ మూవీ నిరాశపరిచింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అదేవిదంగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో నటించింది. చేతిలో సినిమాలు లేకపోవడంతో తన ప్రతిభను చాటుకోడానికి గుర్రపు స్వారీ చేస్తోంది.